Fri Dec 20 2024 10:05:52 GMT+0000 (Coordinated Universal Time)
కరోనాతోనే అందరూ కలసి సినిమాకు వెళ్లి?
కరోనా పాజిటివ్ అధికారులు చెప్పేలోపే ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి పోవడం చర్చనీయాంశమైంది.
ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కలకలం రేగింది. అయితే వారికి కరోనా పాజిటివ్ అధికారులు చెప్పేలోపే ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి పోవడం చర్చనీయాంశమైంది. చీరాలోని శాంతి సినిమా హాలు ఎదురుగా ఒక ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తుంది. తల్లీతండ్రీ, ఇద్దరు కుమారులు ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అయితే వారిద్దరి పిల్లలు ఇటీవల లండన్ నుంచి వచ్చారు.
హైదరాబాద్ కు .....
కుటుంబ సభ్యులంతా కలసి శాంతి థియేటర్ లో సినిమాను కూడా చూశారు. అయితే వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు చెబుతున్నారు. అధికారులు వచ్చే లోపే వారు ఇంటికి తాళం వేసి అందరూ హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో అధికారులు శాంతి థియేటర్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలన్నింటికీ శానిటేషన్ చేస్తున్నారు. వారికి కరోనా సోకిందా? లేక ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? అన్నది నిర్ణారణ కాలేదు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు.
Next Story