Mon Dec 23 2024 17:23:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఉద్యోగ సంఘాల భేటీ.. ఉద్యమం కొనసాగింపుపై?
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ ముఖ్యనేతలు నేడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ ముఖ్యనేతలు నేడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పీఆర్సీపై ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యమంత్రితో కూడా ఉద్యోగ సంఘాలు చర్చించలేదు. క్రిస్మస్ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తో భేటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పీఆర్సీ పై.....
అయితే పీఆర్సీ తాము ఊహించిన విధంగా రాదని ఉద్యోగ సంఘాలు ఒక అంచనాకు వచ్చాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సూచనలతో వారు పీఆర్సీపై కొంత అయోమయంలో ఉన్నారు. జగన్ తో సమావేశానికి ముందుగానే పీఆర్సీపై తాము ఒక అంకె అనుకుంటే బాగుంటుందని ఉద్యోగ సంఘాలు నేడు భేటీ కానున్నాయి. పీఆర్సీ సంతృప్తి కరంగా లేకపోతే మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి జేఏసీ నేతల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story