Tue Apr 08 2025 05:11:17 GMT+0000 (Coordinated Universal Time)
YS Jagan: నన్ను టార్గెట్ చేసుకోండి.. చంపాలనుకుంటే చంపేయండి: వైఎస్ జగన్
ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ జాతీయ మీడియా

ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారంటూ ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమాయక ప్రజలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలన్నారు.కావాలంటే నన్ను టార్గెట్ చేయండి.. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. మానవత్వమన్నది లేదా అని ప్రశ్నించారు. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండని వైఎస్ జగన్ అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా వైసీపీ చేసిన నిరసన దీక్షకు ఉద్ధవ్ శివసేన, వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి ఏఐడీఎంకే, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆమ్ఆద్మీ పార్టీ నేతలు మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపై పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story