Fri Dec 20 2024 08:57:48 GMT+0000 (Coordinated Universal Time)
అది తప్పించుకోడానికే వైఎస్ జగన్ ఢిల్లీ డ్రామా: హోం మినిస్టర్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉండేందుకు ఢిల్లీలో నిరసనకు దిగారని ఏపీ హోం మంత్రి అనిత విమర్శించారు. వైఎస్ జగన్ ఏపీలో గత వారం రోజులుగా 36 హత్యలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు.. ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. దోషులు ఎవరైనా ఉంటే వారిపై కేసులు బుక్ చేస్తామని ఆమె అన్నారు.
చంద్రయ్యను, డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసి శవాన్ని ఎమ్మెల్సీ అనంత బాబు డోర్ డెలివరీ చేయడం వంటి దారుణాలను ఫోటో ఎగ్జిబిషన్ గా పెడితే సగం ఢిల్లీ సరిపోదని వంగలపూడి అనిత అన్నారు. బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు. ఏపీలో ఆందోళన చేస్తే జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బంది వస్తుందని, అందుకే ఢిల్లీకి వేదికను మార్చారని హోంమంత్రి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని ఇంతకు ముందు ఎన్డీయే తిరస్కరించిందని, ఇప్పుడు ఆయన ఇండియా కూటమి వైపు చూస్తున్నారని అనిత ఆరోపించారు.
Next Story