Tue Dec 24 2024 12:19:45 GMT+0000 (Coordinated Universal Time)
రేపు జగన్ బాబు నిజస్వరూపాన్ని చూపుతారా?
రేపు శాసనసభ సమావేశాల్లో జగన్ చంద్రబాబు విషయంలో జరిగిన దానిపై స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
రేపు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రతిపక్షం లేకుండా రేపు సభ జరగనుంది. అయితే రేపు సభలో జగన్ చంద్రబాబు విషయంలో జరిగిన దానిపై స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే రోజు కొంత స్పష్టత ఇచ్చినా ఈ రెండు రోజులు జరిగిన రచ్చ పై ముఖ్యమంత్రి జగన్ స్పందించే అవకాశముంది. నందమూరి కుటుంబంతో పాటు కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీల నుంచి వచ్చిన విమర్శలకు జగన్ సమాధానమిస్తారని తెలుస్తోంది.
వీడియోలు ప్రదర్శించి....
గతంలో తన పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, టీడీపీ నేతలు చేసిన కామెంట్స్ తో పాటు ఆరోజు సభలో జరిగిన విషయాలను వీడియో రూపంలో ప్రదర్శించడానికి రేపు అధికార పార్టీ సిద్ధమవుతుందని సమాచారం. చంద్రబాబు తెలివిగా తనకు అనుకూలంగా సభను మార్చుకున్న తీరును కూడా చూపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నెల 26వ తేదీ వరకూ శాసనసభ సమావేశాలు జరుపుతాయి.
Next Story