Mon Dec 23 2024 12:24:28 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లో మీడియాపై సీఎం జగన్ ఫైర్...
పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూశా.. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలైన పరిస్థితి చూశాను కాబట్టే ప్రజలకు
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి..
పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూశా
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం : సీఎం జగన్
తిరుపతి : ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను మానుకోవాలని, తాను రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలో ఎంతో మంది కష్టాలు చూశామని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తిరుపతిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఉద్దేశ్యంతోనే జగనన్న విద్యా దీవెన పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిందని, ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూశా.. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలైన పరిస్థితి చూశాను కాబట్టే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేయడం జరుతుందని జగన్ తెలిపారు. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు ప్రజలే గమనించాలన్నారు. అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లు జమ చేశామని, ఈ పథకానికి ఇప్పటి వరకు విద్యాదీవెన కింద రూ.10,994 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. జగనన్న వసతి దీవెన కింద మొత్తం రూ.3,329 కోట్లు అందించామన్నారు. గత ప్రభుత్వంలో విద్యా దీవెన వంటి పథకం అమలైందా..? అని, గత ప్రభుత్వం బకాయిలు కూడా తామే చెల్లించామన్నారు. వసతి దీవెన లాంటి పథకాన్ని చంద్రబాబు అమలు చేశారా..? ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల గురించి గత ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకుందా..? చంద్రబాబు ఏనాడైనా ఇంగ్లిష్ మీడియం పెట్టే ఆలోచన చేశారా..? గతంలో జగనన్న అమ్మ ఒడి లాంటి పథకం ఏరోజైనా అమలైందా..? అని ప్రశ్నించారు.
నాడు - నేడు ద్వారా ప్రభుత్వ బడులను పూర్తిగా మార్చడం జరిగిందని, ఈ పథకానికి రూ.11 వేల కోట్లు వెచ్చించామన్నారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ చాలా ముఖ్యమైందని, అందుకే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టామన్నారు. అసలు ప్రభుత్వ బడులు మూసేద్దామన్న ఆలోచనతోనే గత ప్రభుత్వం పని చేసిందని.. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. జగనన్న గోరు ముద్ద పథకంతో నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని.. ఈ పథకానికి రూ.1500 కోట్లపైనే వెచ్చించడం జరిగిందన్నారు.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 34 లక్షల 24 వేల మంది లబ్ధి పొందారని, గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు బడుల్లో చదువుకునే వారి సంఖ్య చాలా వరకు పెరిగిందన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఎల్లో మీడియా జీర్ణించుకోలేక పోతుందని, పదే పదే అబద్ధాన్ని చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో అబద్ధాలు చెబుతారు.. తరువాత పట్టించుకోరు.. ఎన్నికలయ్యాక వారి మేనిఫెస్టో చెత్త బుట్టలోకి పోతుంది.. చంద్రబాబు బలహీన వర్గాలను ఓటు బ్యాంక్ గానే చూశారు.. ఇప్పుడు పరీక్ష పేపర్లు లీక్ చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.
పేపర్లు లీక్ చేసిన వ్యక్తులు నారాయణ స్కూల్స్‌కు చెందినవారే అన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిస్తుంటే తట్టుకోలేక పోతున్నారని.. చేస్తున్న మంచి ప్రజల్లోకి పోకుండా తప్పుడు రాతలు రాస్తున్నారని ఎల్లో మీడియాపై సీఎం మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా అత్యాచార ఘటనల పేరుతో రాజకీయం చేస్తున్నారని.. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది మేమే అని గుర్తు చేశారు. ఏదైనా ఘటనలో దోషులు ఎవరైనా వదిలి పెట్టేది లేదన్నారు.
Next Story