Mon Dec 23 2024 11:10:58 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీలో ఎవరూ శాశ్వతం కాదన్నారు. ఇప్పుడున్న వారు రేపు మరో పార్టీలో ఉంటారని జ్యోతుల చంటిబాబు అన్నారు. తాము కూడా పార్టీలో ఏమైనా శాశ్వతంగా ఉంటామా? అని ఆయన ప్రశ్నించారు. జ్యోతుల చంటి బాబు చేసిన వ్యాఖ్యలపై వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
నియోజకవర్గంలో....
జ్యోతుల చంటిబాబు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని టీడీపీ ఆరోపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా తనకు సహకరిచండం లేదన్న అసహనంతో జ్యోతుల చంటిబాబు ఉన్నారు. జనసేన, టీడీపీలు తనను విమర్శలతో వెంటాడుతుండటంతో జ్యోతుల చంటిబాబు అసహనానికి గురై ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. అందుకే ఆయన పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని, తాము కూడా అని వ్యాఖ్యానించారని అంటున్నారు.
Next Story