Mon Dec 23 2024 15:05:03 GMT+0000 (Coordinated Universal Time)
జల్లికట్టుకు జనం తండోపతండాలు
సంక్రాంతి పండగ వేళ జల్లికట్టు సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి
సంక్రాంతి పండగ వేళ జల్లికట్టు సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఈ జల్లికట్టు పోటీలను నిర్వహిస్తున్నారు. తమిళనాడు సంప్రదాయ జల్లికట్టు ఆటను చిత్తూరు జిల్లాలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. వేలది మంది ప్రజలు ఈ జల్లికట్టును చూసేందుకు తరలి వస్తారు.
రంగంపేటలో....
ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో ఈ ఉత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. రంగంపేట, పుల్లయ్యగారి పల్లిలో జల్లికట్టు సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఇక్కడ జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండానే జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది. యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story