Wed Apr 02 2025 04:09:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేన ఆత్మీయ సమావేశం
విజయవాడలో నేడు జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది

విజయవాడలో నేడు జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేడు ఈ సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు హాజరు కావాలని ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశం జరగనుంది. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరనున్నారు. ఈ సమావేశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించనున్నారు. సారస్వత ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ అదే తరహాలో కలసి పనిచేయాలని నేతలకు నాదెండ్ల దిశానర్దేశం చేయనున్నారు.
Next Story