Mon Dec 23 2024 23:22:32 GMT+0000 (Coordinated Universal Time)
రంగు మార్చాల్సిందే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాష్ట్ర పర్యటనకు ఉపయోగించే వెహికల్ రంగును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాష్ట్ర పర్యటనకు ఉపయోగించే వెహికల్ రంగును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలివ్ గ్రీన్ రంగు కేవలం దేశంలో సైనిక దళాలు ఉపయోగించే వాహనాలకే వినియోగిస్తారు. మోటారు వాహనాల చట్టం ఇదే చెబుతుంది. కానీ పవన్ కల్యాణ్ వెహికల్ ఆర్మీ ఉపయోగించే వాహనాల రంగులో ఉండటంతో దీనిపై చర్చ మొదలయింది.
మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం...
మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం ఈ రంగు దేశంలోని మరే ఇతర వాహనాలకు వినియోగించకూడదు. కానీ పవన్ కల్యాణ్ వాహనం అదే రంగులో ఉండటంతో ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ మోటార్ వాహనాల చట్టాన్ని దుర్వినియోగపర్చారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రోడ్డు మీదకు వస్తే ఆ వెహికల్ ను ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేసే అవకాశముండటంతో ఖచ్చితంగా రంగు మార్చాల్సిందేనంటున్నారు.
Next Story