Wed Dec 18 2024 22:49:49 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా జనసేన జనవాణి అని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పవన్ కల్యాణ్ నేరుగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వారి నుంచి వినతులను తీసుకుంటారు. సామాన్య ప్రజలు ఎవరైనా నేరుగా వచ్చి పవన్ కల్యాణ్ కు తమ సమస్యలను చెప్పుకునే అవకాశముంది. రానున్న ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తారు.
ప్రతి ఆదివారం...
జులై 3వ తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో పవన్ కల్యాణ్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. జులై 10వ తేదీ కూడా విజయవాడలోనే పవన్ కల్యాణ్ వినతులను స్వీకరిస్తారు. జులై 17, జులై 24వ తేదీల్లో మాత్రం పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు వెళ్లి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారని జనసేన పార్టీ తెలిపింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు విన్నూత్న కార్యక్రమాలను జనసేన చేపట్టనుంది.
Next Story