Thu Dec 19 2024 13:06:55 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియచేస్తూ ఆయన కార్టూన్లతో కూడా ట్వీట్లను చేస్తూ వస్తున్నారు. ఈరోజు రోడ్ల అధ్వాన్న స్థితిపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు. సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది.
రోడ్ల దుస్థితిపై...
తూర్పుగోదావరి ప్రాంతంలోని కొత్తపేటలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ కింద డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా పవన్ కల్యాణ్ ఈ ట్వీట్ చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రాహదారి పై ఉన్న గుంతలతో కూడిన వీడియోను రిలీజ్ చేశారు. రహదారిపై గుంతలు లేవని, గుంతల్లోనే రోడ్డు ఉందని ఆయన వ్యంగంగా అన్నారు. #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ ను పవన్ కల్యాణ్ జత చేశారు.
Next Story