Mon Dec 15 2025 04:06:41 GMT+0000 (Coordinated Universal Time)
Pawan kalyan : జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కల్యాణ్
జనసేన నేత పవన్ కల్యాణ్ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు.

జనసేన నేత పవన్ కల్యాణ్ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన జనసేన ఎమ్మెల్యేలు పవన్ ను తమ నేతగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ పేరును శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించడంతో ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలందరూ ఆమోదించారు.
శాసనసభలో...
తెలుగుదేశం పార్టీ తర్వాత అత్యధిక స్థానాలతో జనసేన శాసనసభలో ఉండటంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని జనసేన భావిస్తుంది. ప్రతిపక్ష నేత హోదా కేబినెట్ ర్యాంకు కలిగి ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎంపిక జరగడంతో ఆయనను ఎమ్మెల్యేలు అభినందించారు.
Next Story

