Wed Dec 18 2024 23:21:29 GMT+0000 (Coordinated Universal Time)
Jana Sena : నేటి నుంచి జనసేన జనవాణి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తన ఇంటివద్ద జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తన ఇంటివద్ద జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేటి నుంచి శనివారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కాకినాడలోని ఆయన స్వగృహంలో జనవాణిని ఏర్పాటు చేశారు. తమ సమస్యలను నేరుగా విన్నవించుకోవడానికి జనవాణి ద్వారా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
హెల్ప్ డెస్క్ లో...
అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. సిబ్బంది వచ్చిన సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళతారు. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్న నేపథ్యంలో దానిని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పునరుద్ధరించారు.
Next Story