Thu Dec 19 2024 07:28:14 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు పవన్ పర్యటన ఇలా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయన కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా ఆయన ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభలకు, రోడ్ షోలకు అభిమానులు పోటెత్తుతుండటంతో ఈసారి తమదే విజయం ఖాయమన్న నమ్మకంతో అభ్యర్థులున్నారు.
మూడు నియోజకవర్గాల్లో..
నేడు మండపేట నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. తర్వాత యలమంచలిలో జరిగే బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. అనంతరం అనపర్తిలోనూ బీజేపీ అభ్యర్తికి మద్దతుగా జనసేనాని ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ సభలకు, రోడ్ షోలకు పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.
Next Story