Thu Dec 19 2024 10:07:27 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు విశాఖకు జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించునున్నారు. విశాఖలో జరగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించునున్నారు. విశాఖలో జరగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈరోజు మధ్యాహ్నానికి పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. ఎన్నికల సమయం ఏపీలో దగ్గరపడుతుండటంతో విశాఖలో భారీ బహిరంగ సభను జనసేన ఏర్పాటు చేసింది. ఈ సభ తర్వాత పార్టీ నేతలతో సమావేశమై తాజా రాజీకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
రాష్ట్రంలో సమస్యలపై....
తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించే అవకాశాలున్నాయి. తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ సభలో పవన్ ప్రస్తావించనున్నారు. దీంతో పాటు అనేక ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఆయన ప్రస్తావించనున్నారు. విశాఖలోని ఎస్. రాజా గ్రౌండ్స్ లో జరగనున్న సభకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story