Mon Dec 23 2024 11:19:46 GMT+0000 (Coordinated Universal Time)
Renudesai : రేణుదేశాయ్ వెంటపడుతున్న జనసైనికులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూదేశాయ్ పై జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూదేశాయ్ పై జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు. ఆమె చేసిన పోస్టుపై జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న మాధవీ లతకు మద్దతుగా రేణుదేశాయ్ పోస్టు చేశఆరు. చాలా కాలం తర్వాత తాను ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూశానంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి మాధవీలత పోస్టును జత చేశారు. అంతవరకూ అయితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.
ప్యాకేజీ అంటూ...
అయితే ఈ పోస్టు చేయడానికి తాను ఎవరి నుంచి ప్యాకేజీ తీసుకోలేదంటూ రేణుదేశాయ్ అనడమే వివాదంగా మారింది. మాధవీలత గురించి తన అభిప్రాయం మాత్రమే చెప్పానని, తాను ఆమె నుంచి ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదని చెప్పారు. అయితే ప్యాకేజీ అని తమ అధినేతను పరోక్షంగా ప్రస్తావించారంటూ రేణుదేశాయ్ పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావన లేకపోయినా పరోక్ష:గా ఆమె ప్యాకేజీని ప్రస్తావించడంపై జనసైనికులు అభ్యంతరం చెబుతున్నారు.
Next Story