Fri Apr 04 2025 17:03:39 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : మార్చి నుంచి పవన్ రూటు మార్చనున్నారా? ఇక ఎఫెన్స్ గా వెళతారా?
జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం మౌనంగానే ఉంటున్నారు.

జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం మౌనంగానే ఉంటున్నారు. గత ఏడాది జులై నెలలో మంత్రిగా బాధ్యతలను స్వీకరింంచిన అనంతరం ఆయన ఎక్కువగా తనకు కేటాయించిన శాఖలపైనే ఫోకస్ పెట్టారు. గ్రామీణ అభివృద్ధి, అటవీశాఖ వంటి విషయాలపై ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారు. తన శాఖలో ఏమేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కూటమి కలసికట్టుగా ఉంటేనే విజయం సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఏ విషయంలోనూ ఆయన జోక్యం లేదు. కొన్ని అంశాల్లో మాత్రమే ఆయన స్పందించి వదిలేసినా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
సంచలన వ్యాఖ్యలు చేసి...
తొలుత తిరుమల లడ్డూపై ఆయన సనాతనధర్మం కోసం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. విజయవాడ కనకదుర్గ గుడి మెట్లను శుభ్రంచేశారు. తిరుమల కొండను కాలినడకన ఎక్కారు. ఈ అంశం గత ప్రభుత్వంలో జరిగిన కల్తీకి వ్యతిరేకంగా ఆయన చేసింది. అయితే తర్వాత ఆయన రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టింగ్ లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖపై అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే తాను హోం శాఖ తీసుకుంటానని హెచ్చరించారు. కించపరుస్తూ పోస్టింగ్ లు పెట్టిన వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని, చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని బహిరంగంగానే ఆరోపిచండంతో కూటమిలో కలకలమే రేగింది. ముఖ్యమంత్రి శాంతిభద్రతల వ్యవహారాలను చూస్తుండటంతో చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారని ప్రత్యర్ధుల సంబరపడ్డారు. కానీ ఆ వివాదానికి చంద్రబాబు సుతిమెత్తంగా సరిదిద్దారు.
రేషన్ బియ్యంపై...
ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై కూడా పవన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం సరఫరా అవుతున్నాయని తెలిసి అక్కడకు వెళ్లి సీజ్ ది షిప్ అని ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో తమ కూటమి ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నిస్తుందో చేతల్లోనే ప్రజలకు చూపించగలిగారు. వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పేదలకు అందాల్సి ఉండగా దానిని అక్రమంగా స్మగ్లర్లు విదేశాలకు తరలించడాన్ని కొంత నిలిపివేయడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పల్నాడుకు వెళ్లి సరస్వతి భూముల వద్ద పరిశీలించి అక్కడి రైతులకు అండగా ఉంటానని చెప్పారు. తర్వాత సరస్వతి భూములను ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా వరసగా ఒక్కొక్క సమస్యను పోరాడుతూ దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతుండటాన్ని అభినందిస్తున్నారు.
రాయలసీమ నుంచి...
మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి మార్చి నెల నుంచి ఇక పర్యటనలు చేపట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని తెలిసింది. మార్చి నెలలో జనసేన ప్లీనరీ పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. పథ్నాలుగో తేదీన జనసేన ప్లీనరీ జరుగుతుంది. ఈ ప్లీనరీ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన రోడ్ మ్యాప్ ను రూపొందించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమకుపట్టులేని ప్రాంతాల్లో అంటే రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే ఎక్కవగా పర్యటనలు చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.అక్కడ తిరిగి వైసీపీ అక్కడ బలోపేతం కాకుండా ముందుగానే అక్కడ జనసేనను పటిష్టం చేయాలన్నఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలిసింది.
Next Story