Mon Dec 23 2024 12:47:33 GMT+0000 (Coordinated Universal Time)
Naga Babu : నాగబాబు - ఒక పిట్టకధ... జగన్ ఉద్దేశించి .. అదిరిపోలా
అనుభవం, సమర్థత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్టకథను జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు
సీఎం జగన్ పై జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. అనుభవం, సమర్థత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్టకథను జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. జగన్ కు రెండోసారి అవకాశం ఇస్తే నాశనం అనే అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ చేయడంతో అది వైరల్ గా మారింది. నాగబాబు తరచూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతుంటారు.
పిట్టకధ ఏంటంటే?
ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది. అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు. 'విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది. అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు. 'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది. అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది.యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు. 'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది. ఇందులో నీతి ఏంటంటే... నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి. విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు. అంటూ నాగబాబు పిట్టకధను ముగించారు.
Next Story