Mon Dec 23 2024 12:26:24 GMT+0000 (Coordinated Universal Time)
అంబటికి ఎందుకు నోటీసులివ్వలేదు?
మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన నేత ఉషాకిరణ్ నిలదీశారు
మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన నేత ఉషాకిరణ్ నిలదీశారు. పవన్ కల్యాణ్ కు ఇచ్చిన నోటీసులు మంత్రి అంబటి రాంబాబుకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. అంబటి రాంబాబు మహిళల పట్ల హేళనగా ప్రవర్తించారన్న విషయం మీ దృష్టికి రాలేదా? అని ఉషాకిరణ్ ప్రశ్నించారు. అశ్లీల వీడియోలతో హల్ చల్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారా? అని ఆమె నిలదీశారు.
వైసీపీ రంగు...
రాష్ట్రంలో ఎవరు విడాకులు ఇచ్చినా వారందరికీ నోటీసులు ఇస్తారా? అని వాసిరెడ్డి పద్మను ప్రశ్నించారు. కానినో నిర్వహించిన కొడాలి నానికి ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి కొద్ది దూరంలోనే మహిళపై అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడలేదన్నారు. పవన్ కల్యాణ్ కు నోటీసులు పంపడం దిగజారుడుతనమేనని ఆమె ధ్వజమెత్తారు.
మహిళ ఛైర్ పర్సన్ వైసీపీ రంగు చీర కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
Next Story