Mon Dec 23 2024 14:42:03 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన "గుడ్ మార్నింగ్ సీఎం సార్"
గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన విన్నూత్న కార్యక్రమాలను చేపడుతుంది. ఇప్పటికే కౌలు రైతులకు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఆదివారం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొంటున్నారు. తాజాగా మరో కార్యక్రమాన్ని రూపొందించింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ఈ కార్యక్రమాన్ని జగనసేన కార్యక్రమం ఈ నెల 15,16,17 తేదీల్లో చేపట్టనుందని తెనాలిలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
పెట్రోల్ సెస్సు వసూలు చేస్తూ...
రాష్ట్రంలో కనీసం రహదారులకు మరమ్మతులు చేపట్టలేదని, గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిజిటల్ క్యాంపెయిన్ లో స్వయంగా పవన్ కల్యాణ్ పాల్గొంటారని చెప్పారు. రోడ్ల దుస్థితిపై ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేయనున్నారు. పెట్రోలు మీద 750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తూ రహదారులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
Next Story