Tue Dec 24 2024 01:38:07 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై అంబటి ఫైర్... ఆ గిఫ్ట్ మాటేమిటి?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ పై ఆయన చేసిన విమర్శలను తిప్పికొట్టారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ పై ఆయన చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పవన్ ఇక్కడ రెండు ఎకరాల గిఫ్ట్ ను కొట్టేయడంతోనే అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన సినిమాలను ఆపాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. పవన్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంత? కట్టే ట్యాక్స్ ఎంత? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
సినిమాల్లో వారసత్వాన్ని...
రాజకీయాల్లో వారసత్వాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ సినిమాల్లోనూ వారసత్వాన్ని వ్యతిరేకిస్తారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని, దానిని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం మాత్రం బాగానే చేశారని, కానీ జనం అంత సులువుగా నమ్మరని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చి కాసేపు కూర్చుని హడావిడి చేసి లేస్తే మనిషిని కాను అనే వ్యక్తి పవన్ కల్యాణ్ అని అంబటి రాంబాబు అన్నారు.
Next Story