Mon Dec 23 2024 03:07:49 GMT+0000 (Coordinated Universal Time)
రైతు కుటుంబాలకు జనసేన ఆర్థిక సహాయం.. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష
ఉగాది పర్వదినం రోజు కూడా ఆ రైతు కుటుంబాలు దుఃఖంతో, బాధతో ఉండకూడదన్న భావనతోనే.. జనసేన పక్షాన
ఏలూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలపై ఫోకస్ పెట్టారు. ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనే 80మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే వ్యవసాయాన్నే నమ్ముకున్న వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోందన్నారు.
ఉగాది పర్వదినం రోజు కూడా ఆ రైతు కుటుంబాలు దుఃఖంతో, బాధతో ఉండకూడదన్న భావనతోనే.. జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి జనసేన రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నామని ప్రకటించారు పవన్ కల్యాణ్. త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు.
Next Story