Mon Dec 23 2024 12:41:25 GMT+0000 (Coordinated Universal Time)
గుర్తుపై హైకోర్టుకు జనసేన
గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం పై జనసేన హైకోర్టును ఆశ్రయించింది
గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయం పై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తాము పొత్తులో ఉన్నందునే కొన్ని స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నామని, అందుకోసమే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని, ఫ్రీ సింబల్ అని చెప్పి జనసేన పోటీ చేయని మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించడంపై జనసేన సవాల్ చేసింది.
రేపటికి వాయిదా...
తాము రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని, మిగిలిన చోట పొత్తులో ఉన్న బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఉన్నామని వారు కోర్టుకు వివరించారు. అయితే దీనిపై న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఫ్రీ సింబల్ పేరుతో స్వతంత్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ మాత్రం 24 గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా పడింది.
Next Story