Fri Dec 27 2024 19:38:16 GMT+0000 (Coordinated Universal Time)
చల్ల గాలి కోసం.. పవన్ ట్వీట్
చల్లగాలి కోసం ఆర్కే బీచ్ కు వెళ్లాలని ఉందని, అనుమతి ఉందా అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
చల్లగాలి కోసం ఆర్కే బీచ్ కు వెళ్లాలని ఉందని, అనుమతి ఉందా అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని నోవాటెల్ లోని హోటల్ లోనే ఉన్నారు. విశాఖలో సెక్షన్ 30 అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలకు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పడంతో ఆయన నోవాటెల్ హోటల్ కే పరిమితమయ్యారు.
బయటకు తెచ్చేందుకు...
ఈ మేరకు ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో జనసేన ముఖ్య నేతలతో ఆయన సమావేశమయి పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారని తెలిసింది. అరెస్టయిన జనసేన కార్యకర్తలను బయటకు తెచ్చేందుకు ఆయన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. వారిని బయటకు తీసుకు వచ్చిన తర్వాతనే తాను హైదరాబాద్ బయలుదేరి వెళ్లాలనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story