Mon Dec 15 2025 04:16:49 GMT+0000 (Coordinated Universal Time)
వారు సిగ్గు పడాలి: పవన్ కళ్యాణ్
అతిక్రమణలకు పాల్పడుతున్నారని, కులానికి, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని

నా ప్రశాంతతను చేతగానితనంగా భావించవద్దు.. అది నా బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో కొందరు అధికారులు రాజ్యాంగ అతిక్రమణలకు పాల్పడుతున్నారని, కులానికి, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అధికారులకు సిగ్గుండాలని అన్నారు. నాడు 389 మంది ప్రతినిధులు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇవాళ జగన్ వచ్చి అంతా నేనే అంటే చూస్తూ ఊరుకుంటామా? అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం వద్దు అని శ్రీకృష్ణుడిలా చాలా రాయబారాలు నడిపాను... నీకు యుద్ధమే కావాలనుకుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని ఇస్తాను... సిద్ధంగా ఉండు అని సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు పవన్ కళ్యాణ్. జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
అధికారంలోకి వస్తే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కొందరి భావన అని.. చేసేపని సరైందే అని ఐపీఎస్ అధికారులకు అనిపిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు సిగ్గు పడాలన్నారు. మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం. పదవి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు జనసేనాని. 40 ఏళ్ల అనుభవమున్న పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.. సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని అన్నారు పవన్ కళ్యాణ్.
Next Story

