Thu Dec 19 2024 12:33:50 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : అందుకే నేను చంద్రబాబుకు మద్దతిచ్చా
రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరత ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు. గుడివాడలో జరిగిన సభలో మాట్లాడారు.
రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరత ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు. గుడివాడలో జరిగిన సభలో పవన్ మాట్లాడారు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారదని అన్నారు. జగన్ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వమని, దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చేసరికి భయపడరన్నారు. ఎదరుతిరుగుతారన్నారు. స్వేచ్ఛే ఈ దేశానికి వెన్నెముక జగన్ను చూసి, వైసీపీ నాయకులను చూసిభయపడాలా? అని ప్రశ్నించారు.
బలమైన నాయకుడని...
ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయిన రోజు అన్ని వేల కోట్లున్నా నిష్ప్రయోజనమే నని పవన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బలమైన నాయకుడని, జైలులో ఉన్నా తొణకలేదన్నారు. ఇలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే అనుకున్నానని, 30 కేసులుండి ఐదేళ్ల నుంచి జగన్ బెయిల్పై ఉన్నారని, ఈ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర సర్వనాశనమైందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
Next Story