Mon Apr 07 2025 13:50:51 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ సర్ప్రైజ్ గిఫ్ట్ లు.. వారికి మాత్రమే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి క్రిస్మస్ వేడుకలను ఇక్కడే జరపుకోన్నారని చెబుతున్నారు

క్రిస్మస్ వేడుకలను సెలబ్రిటీలు అందరూ చేసుకుంటారు. మతాలకతీతంగా జరుపుకుంటారు. ఇక రాజకీయ నాయకులైతే సెమీ క్రిస్మస్ వేడుకలను కొన్ని రోజుల ముందు నుంచే మొదలు పెడతారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి క్రిస్మస్ వేడుకలను ఇక్కడే జరపుకోన్నారని చెబుతున్నారు. ఆయన ప్రతి ఏడాది క్రిస్మస్ పండగ కోసం రష్యాకు వెళతారు. పవన్ సతీమణి అన్నా లెజినోవా ది రష్యా కావడంతో ఆయన అక్కడకు వెళ్లి పండగను సెలబ్రేట్ చేసుంటారు.
క్రిస్మస్ వేడుకలు ఇక్కడే...
కానీ ఈసారి మాత్రం వరసగా షూటింగ్ లు ఉండటం, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. అంతే కాదు తన సన్నిహితులు, నిర్మాతలు, డైరెక్టర్లకు పవన్ కల్యాణ్, అన్నా లెజినోవాలు సర్ప్రైజ్ గిఫ్ట్ లు పంపుతున్నారు. పవన్ నుంచి వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ లను చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన తనకు ఇష్టమైన వారందరికీ స్పెషల్ గిఫ్ట్ లను పంపుతున్నారు.
Next Story