Fri Dec 20 2024 22:42:25 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : మరో జనసేన అభ్యర్థి ఖరారు
పాలకొండ నియోజకవర్గం జనసిన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు
పాలకొండ నియోజకవర్గం జనసిన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఎస్టీలకు రిజర్వు చేసిన పాలకొండ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ బరిలో నిలవనున్నారు. ఈ నియోజకవర్గం నుంచీ టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండి పోటీపడడంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయని తెలిపారు.
పాలకొండ అభ్యర్థిగా...
ఈ సర్వేలో నిమ్మక జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించడంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయనను అభ్యర్ధిగా ఖరారు చేశారు. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. దీంతో అవనిగడ్డలో బుద్దప్రసాద్ తరహాలోనే పాలకొండలో నిమ్మక జయకృష్ణకు ఆయన టిక్కెట్ ఖరారు చేశారు.
Next Story