Mon Dec 23 2024 07:56:59 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : రాజమండ్రి నేతలతో పవన్ ఏమన్నారంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కూడా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కూడా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమయింది. ఏవీఏ రోడ్డులోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది.
రానున్న ఎన్నికల్లో...
అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీతో ఏ పరిస్థితులతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందీ పవన్ కల్యాణ్ వివరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏ ఏ స్థానాలను జనసేన ఎంచుకుంటే బాగుంటుందని కూడా ఆయన నేతల నుంచి అభిప్రాయాలను తీసుకుంటుననారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన చర్చిస్తున్నారు. టిక్కెట్ లు దక్కని నేతలకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదవులు ఇస్తామని కూడా పవన్ కల్యాణ్ నేతలకు చెబుతున్నారు. అందరూ కలసి పనిచేయాలని, ఓట్లు బదిలీ అయ్యేలా చూసి జనసేనకు అధిక స్థానాలు దక్కేలా శ్రమించాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
Next Story