Mon Dec 23 2024 04:45:53 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ సంచలన వ్యాఖ్యలు.. డబ్బులు లేకుంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రానున్న కాలంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని అన్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రానున్న కాలంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని అన్నారు. భీమవరంలో ఆయన నేతలతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనివార్యమయిందన్నారు. నాయకులు డబ్బులు ఖర్చుపెట్టాల్సిందేననన్న వపన్, కనీసం భోజన ఖర్చులైనా పెట్టుకోరా అని ప్రశ్నించారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలను ఆపబోమని, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుంటుందని ఆయన తెలిపారు.
అధికారంలోకి వస్తే...
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ పథకాన్ని ఆపబోమని అన్న పవన్, ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు. అయితే ఈ ఎన్నికలలో ఓట్లు కొంటారా? లేదా? అన్నది మీ ఇష్టం అని అన్నారు. ఈసారి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నానని, టీడీపీ, జనసేన ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. ఈ కూటమికి బీజేపీ ఆశీర్వాదం కావాలన్న పవన్ కల్యాణ్ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. జగన్ సిద్ధం అంటే తాము యుద్ధం అని అంటామని అన్నారు.
Next Story