Sun Dec 22 2024 22:02:42 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా తో పవన్ భేటీ.. టాపిక్ అదే అయ్యుండొచ్చు
ఎన్డీయే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. బుధవారం
ఎన్డీయే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పవన్ కళ్యాణ్ నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో షాను కలుసుకున్నారు. ఇద్దరూ 25 నిమిషాలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మంతనాలు సాగించినట్లు తెలిసింది. జనసేనాని ఢిల్లీ పర్యటనలో ఏపీ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధరన్ ను కలిశారు. అమిత్ షాతో భేటీ అనంతరం జనసేనాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా.. కేంద్ర హోంమంత్రితో కీలక సమావేశం జరిగిందని అన్నారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు.
మంగళవారం ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే వచ్చిన పవన్.. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి అన్ని శక్తులు ఏకం కావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పొత్తులు, జగన్ ప్రభుత్వం తీరుపై అమిత్ షాతో ఆయన చర్చించినట్లు సమాచారం. నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్న భవిష్యత్ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయేకు దగ్గరగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉన్నారు.ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడం వల్ల దేశం సుస్థిరత దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story