Mon Dec 23 2024 17:59:38 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : చంద్రబాబు ఇంటికి పవన్... సీట్ల సర్దుబాటుపై
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ సమావేవం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మ్యానిఫేస్టోతో పాటు ఉమ్మడి ప్రచారంపై కూడా ఇరుపార్టీల నేతలు నేడు చర్చించే అవకాశముంది.
ఎన్నికలలో అనుసరించాల్సిన...
అయితే ఇంకా అభ్యర్థులను బీజేపీ ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కొన్ని స్థానాల విషయంలో పట్టుబడుతుంది. సీనియర్ నేతలు తమకు ఓడిపోయే సీట్లు ఇచ్చారని బీజేపీ నాయకత్వానికి లేఖలు రాయగా దానిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు అంశంపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించనున్నారని తెలిసింది.
Next Story