Mon Dec 15 2025 00:15:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెనాలిలో పవన్ పై రాళ్లతో దాడి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి చేరుకున్నారు. అయితే ఆయన రాయి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి చేరుకున్నారు. అయితే ఆయన రాయి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెనాలిలో విజయభేరి సభలో పాల్గొనేందుకు వచ్చినే పవన్ కల్యాణ్ కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. వారాహి యాత్రలో భాగంగా ఆయన వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఆ రాయి ఆయనకు తగలలేదు.
తృటిలో తప్పించుకోవడంతో...
దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే రాయి విసిరిన వ్యక్తిని మాత్రం అక్కడ ఉన్న నేతలు గుర్తించారు. ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ వ్యక్తి ఎవరు? పవన్ పై రాయిని ఎందుకు విసరాల్సి వచ్చిందన్నది పోలీసు విచారణలో తేలనుంది. మరికాసేపట్లో పవన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Next Story

