Thu Dec 19 2024 00:13:32 GMT+0000 (Coordinated Universal Time)
శాంతిభద్రతలు ఉన్నాయా?
తాడేపల్లిలో అంధయువతి హత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని అభిప్రాయపడ్డారు
తాడేపల్లిలో అంధయువతి హత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని పవన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నివాసం పక్కనే ఈ ఘటన జరిగినా జగన్ కు చీమకుట్టినట్లయినా లేదని, ఆయన కనీసం స్పందించకపోవడం విచారకరమని పవన్ కల్యాణ్ అన్నారు.
అంధ యువతిపై...
శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని పవన్ కల్యాణ్ అన్నారు. అంధ యువతిని హత్య చేయడం తనను కలసి వేసిందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఆ యువతి కుటుంబానికి న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
Next Story