Mon Dec 23 2024 06:55:28 GMT+0000 (Coordinated Universal Time)
పిఠాపురంలో అందుకే పోటీ చేస్తున్నా : పవన్ కల్యాణ్
పిఠాపురం చాలా ప్రత్యేక నియోజకవర్గమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
పిఠాపురం చాలా ప్రత్యేక నియోజకవర్గమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 2019 ఎన్నికల్లోనే తాను పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, కానీ అనుకోని పరిస్థితుల్లో అప్పుడు గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ఇతర నియోజకవర్గాల్లో పోట ీచేస్తే తాను రాష్ట్రమంతటా పర్యటించడం కష్టమవుతుందన్నారు. పిఠాపురంలో అయితే తనను ఆశీర్వదిస్తారనే ఇక్కడకు వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురం అభివృద్ధిని తనకు వదిలేయాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కోరారు.
అభివృద్ధిలో ...
తాను ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకు తగిన సమయం కావాలంటే పిఠాపురం మంచిదని పెద్దలు చెప్పడంతో దీనిని ఎంచుకోవడం జరిగిందన్నారు. తన రాజకీయం పిఠాపురం నుంచే ప్రారంభమవుతుందన్న ఆయన రాష్ట్ర అభివృద్ధిని ఇక్కడి నుంచే చేయడానికి తన వంతు ప్రయత్నాన్ని చేస్తానన్నారు. పిఠాపురం తన సొంత ప్రాంతమని, దీని అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం నేతలను పేర్లు చదవి ఆయన పరిచయం చేసుకున్నారు.
Next Story