Pawan Kalyan : సీఎం పదవిపై పవన్ ఆసక్తికర కామెంట్స్.. మేమిద్దరమే కూర్చుని
యువతరం కోసమే తన ఆలోచన అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
యువతరం కోసమే తన ఆలోచన అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర తనకు ఓనమాలు నేర్పిందన్నారు. ఈ ప్రాంతం అందరినీ అక్కున చేర్చుకుందన్నారు. తాను ఇక్కడకు ఓటమి పాలయినా భయపడేది లేదన్నారు. బాధపడేది ఉండదన్నారు. ఇక్కడి వారు వలసలు పోతున్నారని, అవి ఆగాలంటే కొత్త ప్రభుత్వం రావాలని పవన్ కల్యాణ్ కోరారు. అధికారం కోసం తాను ఓట్లు అడగనని, మార్పు కోసమే తాను ఓట్లు అడుగుతున్నానని ఆయన చెప్పారు. గాజువాకలో ఓడిపోతే తాను పెద్దగా ఫీల్ కాలేదన్నారు. కానీ విశాఖ వచ్చిన రోజు రెండు లక్షల మంది వచ్చారని, ఆ ప్రేమ తనకు కన్నీళ్లు తెప్పించిందన్నారు. తాను జనసేనను ఏ పార్టీలో కలపను, బతికినా, మరణించినా పార్టీ ఎక్కడకూ వెళ్లదన్నారు. అభిమానం, ప్రేమ ఓట్ల రూపంలో బదిలీ కాకుంటే మీరిచ్చే నినాదాలు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది తాను, చంద్రబాబు కలసి కూర్చుని నిర్ణయించుకుంటామని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ వెనక నడవటం లేదని, కలసి నడుస్తున్నామని చెప్పారు.