Mon Dec 23 2024 03:28:30 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ధర్మందే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం
ఆంధ్రప్రదేశ్ లో సర్కార్ మారబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు అది రుజువయిందని తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో సర్కార్ మారబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు అది రుజువయిందని తెలిపారు. బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాుతూ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని తెలిపారు. మూడో సారి ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడుతున్నారన్నారు. 2014లో వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతిలో ప్రారంభమైన పొత్తు ఇప్పుడు బెజవాడ దుర్మమ్మ సాక్షఇగా కొత్త రూపం సంతరించుకోబోతోందని పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతికి అండగా...
రాజధాని అమరావతికి మోదీ అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చారన్న పవన్ కల్యాణ్ జగన్ అరాచక పాలనకు చరమగీతం పలకాలన్నారు. జగన్ సారా వ్యాపారిగా మారి రాష్ట్రంలో దోపిడీకి తెరతీశారన్నారు. పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోవడంతో ఉపాధి అవకాశాలు కరువై యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతుందన్నారు. అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి, ఈ రావణుడిని అంతంచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఏపీలో రామరాజ్య స్థాపన జరగబోతుందని పవన్ అన్నారు.
Next Story