Mon Dec 23 2024 00:08:05 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే కోనసీమకు వెళతా
కోనసీమలో ఘర్షణలు ఉద్దేశ్యపూర్వకంగానే జరిగినవని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు
కోనసీమలో ఘర్షణలు ఉద్దేశ్యపూర్వకంగానే జరిగినవని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. అల్లర్లు జరిగిన కోనసీమకు మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కోనసీమ తగలబడుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేస్తారా? అని జనసేనాని నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్లలో ఫైర్ ఇంజిన్లు ఎందుకు రాలేదన్నారు. జిల్లాల విభజనలో విరుద్ధమైన విధానాలను ప్రభుత్వం అవలంబిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ఒక పార్టీలో రెండు గ్రూపుల వల్లే....
కోనసీమ అల్లర్లపై నిఘా విభాగానికి ఎందుకు సమాచారం అందలేదన్నారు. గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసునని, అందుకే ఇప్పటి వరకూ పాలకులు స్పందించలేదని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడ సమస్య అంబేద్కర్ కాదని ఒక పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవలని పవన్ కల్యాణ్ తెలిపారు. అవి తొక్కి పెట్టి మిగిలిన పార్టీలపై బురద జల్లే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారని పవన్ అన్నారు. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత తాను కోనసీమలో పర్యటిస్తానని చెప్పారు.
Next Story