Thu Jan 09 2025 06:37:44 GMT+0000 (Coordinated Universal Time)
దేనికీ గర్జనలు...?
వైసీపీ రాజీనామాలు, జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.
వికేంద్రీకరణపై వైసీపీ రాజీనామాలు, జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీకి ప్రశ్నలు...
ఉత్తరాంధ్రలో వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాందుకా? విశాఖపట్నంలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకుంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా? దేనికి ఈ గర్జనలంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.
Next Story