Thu Jan 09 2025 07:28:27 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ పోర్టులో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. అక్కడ షిప్ లో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. అక్కడ షిప్ లో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గత కొద్ది రోజులుగా కాకినాడగా జరుగుతుంది. వైసీపీ హయాంలో కూడా ఇదేరకమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కల్యాణ్ దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేపై...
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం రావడంతో పవన్ కల్యాణ్ కాకినాడ వచ్చి మరీ షిప్ లో సోదాలు నిర్వహించారు. కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పై ఆయన స్పాట్ లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 640 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకన్నారు. నౌకలోకి వెళ్లి మరీ దాడులు నిర్వహించిన పవన్ కల్యాణ్ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు అధికారులపై కూడా పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
Next Story