Sun Dec 22 2024 21:34:22 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : పవన్ తో నో ఫొటో.. నో షేక్ హ్యాండ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆయన పర్యటన ఉందని తెలిసి పెద్దయెత్తున అభిమానులు తరలి వస్తున్నారు. అయితే అభిమానులు ఎవరూ పూలు విసరడం కానీ ఫొటోలు దిగేందుకు ప్రయత్నించడం కానీ, షేక్ హ్యాండ్ లు ఇవ్వడం వంటివి చేయవద్దంటూ జనసేన పార్టీ ఇప్పటికే హెచ్చరించింది.
నేడు రెండు నియోజకవర్గాల్లో...
ఆయన అనారోగ్యంగా ఉన్నారని, తరచూ జ్వరంతో బాధపడుతున్నారని, ప్రచారంలో అభిమానులు పవన్ కల్యాణ్ కు సహకరించాలని జనసేన పార్టీ ఇప్పటికే పదే పదే విజ్ఞప్తులు చేసింది. ఆయన ఈరోజు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు లలో జరిగే బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
Next Story