Mon Dec 23 2024 11:40:22 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు రోజులు పవన్ ఇక్కడే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విజయవాడ రానున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశాలు జరపనున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విజయవాడ రానున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశాలు జరపనున్నారు. ఈరోజు నుంచి 14వ తేదీ వరకూ ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటారు. ఈ నెల 14న జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగనున్న బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అందులో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.
నేడు మంగళగిరికి పవన్...
రేపు ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం రెండుగంటలకు కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ కానున్నారు. దీనికి చేగొండి హరిరామ జోగయ్య కూడా హాజరు కానున్నారు. 13వ తేదీ ఉదయం పవన్ కల్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నం సభకు బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story