Wed Dec 18 2024 15:21:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీకి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. పొత్తులు, ఏపీలో రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారని తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
మరోసారి భీమవరం నుంచి ...
పవన్ కల్యాణ్ తాను మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని భీమవరంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తాను వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో పవన్ పోటీపై క్లారిటీ వచ్చినట్లయింది. తాను భీమవరం నుంచి పోటీ చేయాలని, తనకు మద్దతివ్వాలని కోరినట్లు తెలిసింది.
Next Story