Sun Jan 12 2025 12:01:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్‌తో పవన్ భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఆయన ఏపీ గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారి పవన్ కల్యాణ్ ఆయనను రాజ్‌భవన్ కు వెళ్లి కలిసి అభినందనలు తెలియచేయనున్నారు. పవన్ కల్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా మాతమ్రే కలవనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ తో పవన్ అపాయింట్మెంట్ దొరకడంతో ఆయన సాయంత్రం రాజ్‌భవన్ కు వెళ్లనున్నారు.
ముఖ్యనేతలతో...
గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉన్నారు. బీసీ సామాజివర్గం కార్యకర్తలతో పాటు కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు. రేపు జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి కూడా నేతలతో చర్చించనున్నారు.
Next Story