Fri Dec 20 2024 19:09:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నరసాపురానికి పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నరసాపురంలో పర్యటించనున్నారు. ఆయన మత్స్యకార అభ్యున్నతి సభలో ప్రసంగించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నరసాపురంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి పది గంటలకు బయలుదేరి రాజమండ్రికి విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం రెండు గంటలకు నరసాపురం వస్తారు. నరసాపురం పట్టణంలోని ఇసుక ర్యాంప్ నుంచి పవన్ కల్యాణ్ రోడ్ షో జరుగుతుంది. వీవర్స్ కాలనీలో వద్దకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు.
మత్స్యకారుల.....
మత్స్యాకారుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా జనసేన ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. పవన్ కల్యాణ్ సభకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు హజరయ్యే అవకాశముంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story