Mon Dec 23 2024 06:04:44 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఉద్దేశం అదే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న చేసిన ప్రసంగంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న చేసిన ప్రసంగంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. జనసేన, టీడీపీతో కలసి పనిచేసే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చబోమని పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీతో దోస్తి కట్టినట్లేనని రఘురామ కృష్ణరాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఆయన కలసి నడిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
మూడు పార్టీలు కలిస్తే....
బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలపి బరిలోకి దిగితే ఖచ్చితంగా విజయం ఖాయమని పవన్ కల్యాణ్ అభిప్రాయం కావచ్చని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోతే నష్టం ఎవరికన్నది చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బలమైన ప్రతిపక్షాలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్ ఉద్దేశ్యమని రఘురామ కృష్ణరాజు వివరించారు.
Next Story