Fri Dec 20 2024 14:12:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పటంలో ప్రారంభమైన జనసేన ఆవిర్భావ సభ
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి : పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నేటితో 8 వసంతాలు పూర్తి చేసుకుని, 9వ ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సభకు హాజరయ్యారు.
జనసేన ఆవిర్భావ సభకు జనసైనికులు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. సభ జరిగే వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరిట నామకరణం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు పరిణామాలపై తన సమాధానాన్ని పవన్ ఈ సభ ద్వారా తెలియజేస్తానని పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే సభ ఆరంభమవ్వగా.. పవన్ కల్యాణ్ ప్రసంగం కోసం జనసైనికులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Next Story