Sat Dec 21 2024 11:14:01 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జనసేనకు షాక్.. కీలక నేత రాజీనామా
విజయవాడలో జనసేనకు భారీ షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు
విజయవాడలో జనసేనకు భారీ షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉన్న పదవులకు, ప్రాధమిక సభ్యత్వానికి కూడా పోతిన మహేష్ రాజీనామా చేశారు. ఆయన మొన్నటి వరకూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆశించారు.
పొత్తులో భాగంగా....
అయితే కూటమిలో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి వెళ్లింది. అక్కడి నుంచి బీజేపీ తరుపున సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా? లేక ఇతర పార్టీల్లో చేరతారా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story