Mon Dec 23 2024 15:52:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎవడితోనైనా పెట్టుకో.. నాతో గొడవలొద్దు : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ఛీఫ్, ముఖ్యమంత్రి జగన్ కు వార్నింగ్ ఇచ్చారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ఛీఫ్, ముఖ్యమంత్రి జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని తెలిపారు. పెడన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా తనకు బలం లేదని, అభిమానుల బలమే తనకు అండ అని ఆయన తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా జైలు కెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్పించి భయపడబోనని తెలిపారు. తాను ఎవరికీ భయపడనని, తొక్కి నార తీస్తానని చెప్పారు. మాట నిలబెట్టుకోలేనప్పుడు నా బతుకెంత అని తనను తాను ప్రశ్నించుకున్నారు. వాలంటీర్ల పై తాను చేసిన వ్యాఖ్యలను తాను వెనక్కు తీసుకనని ఆయన తెలిపారు.
తొక్కి నార తీస్తా...
జగన్ పై తాను ప్రధానికి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నారు. కులాలను విడదీసే రాజకీయాలు చేయనని అన్నారు. తాను పీఆర్పీ లో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ ఎంపీగా కూడా గెలవలేదన్నారు. తాను కాపు సామాజికవర్గం కాబట్టి కాపు నేతలతో జగన్ తనను తిట్టిస్తున్నాడని ఆయన అన్నారు. ఏపీలోకి రావాలంటే పాస్ పోర్టు కావాలా? అని పవన్ ప్రశ్నించారు. కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్తోనే తాను గొడవ పెట్టుకున్నానని చెప్పారు.
మాజీ సీఎంను జైల్లో పెడతారా?
తాను పదేళ్లుగా పార్టీని నడుపుతున్నానని, ఏనాడూ డబ్బుల గురించి ఆలోచించలేదని పవన్ అన్నారు. ప్రధానికే తెలిసిన వ్యక్తిని ఇంత ఇబ్బంది పెడతారా? అని పవన్ ప్రశ్నించారు. తనకే ఇన్ని ఇబ్బందులుంటే ఇక సామాన్యుడు పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. అధికారంలోకి రావడమే తన అంతిమ లక్ష్యం కాదని, రాజకీయాల్లోకి యువతరం రావాలని ఆయన పిలుపు నిచ్చారు. తాను రెచ్చగొట్టేలా మాట్లాడనని ఎస్పీ అంటున్నారని, తాను అలా మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఒక తప్పుడు కేసు పెట్టి మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టే హక్కు జగన్ కు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ తో కూర్చుని ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందిస్తానని పవన్ తెలిపారు.
జగన్ కు ఆ దమ్ముందా?
జగన్ కు దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పై పోరాడాలని ఆయన సవాల్ విసిరారు. పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు చతుర్ముఖ నగరాలుగా చేస్తామని తెలిపారు. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపు నిచ్చారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని అన్నారు. వైసీపీ పథకాల్లో డొల్లతనం తప్ప ఏమీ లేదని అన్నారు. ఈసారి ఓట్లు చీలనివ్వనని, వైసీపీని అధికారంలోకి రానివ్వనని ఆయన పెడన సభలో తెలిపారు.
Next Story